మంగ్లీకి షాక్ – ‘సర్కే చునార్ తేరీ’ పాటపై వివాదం, కేంద్రం చర్యలు
కేడీ ది డెవిల్ సినిమాలోని ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాట వివాదంలో చిక్కుకున్న సింగర్ మంగ్లీ తాజాగా స్పందించారు. ఈ సినిమా ధ్రువ సర్జా హీరోగా, ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కింది.

పాటపై వివాదం: ఇటీవల విడుదలైన ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాటలోని లిరిక్స్ పై ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఈ పాటలోని కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పాట తెలుగు వెర్షన్‌లో “జరిపే నాతో పండగ జరిపే” అంటూ చంద్రబోస్ లిరిక్స్ రాశారు, అర్జున్ జన్యా సంగీతం అందించారు. హిందీ, తెలుగు వెర్షన్లను మంగ్లీ పాడారు. తాన పాట వివాదాస్పదంగా మారడంతో సింగర్ మంగ్లీ సోషల్ మీడియాలో స్పందించారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని, అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు.
ఈ పాటపై ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీనిపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ స్పందిస్తూ, ఈ పాటను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి అభ్యంతరకర కంటెంట్ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. మొత్తానికి ‘సర్కే చునార్ తేరీ’ పాటపై వచ్చిన వివాదం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మంగ్లీ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి.

