హైదరాబాద్ లో విషాదం – పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ మీర్ పేట్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

బీఎస్సీ చదువుతున్న హిమబిందు (20) అనే యువతి తన కుటుంబంతో మీర్పేట్ లో నివసిస్తుంది. తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు పిల్లి నిన్న ఉదయం మృతి చెందింది. పిల్లి, మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన హిమబిందు, ఆవేదనతో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు నిర్దారించారు.

