తెలంగాణలో భారీ వర్షాలు – రేయిన్ అలర్ట్, పంటలకు భారీ నష్టం

రెండు తెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్టంలో పలు జిల్లాల్లో రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా జరిగినట్లు సమాచారం.

వాతావరణ శాఖ హెచ్చరిక: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్, యాదాద్రి, జనగామ, మెదక్, సిద్దిపేట, ఖమ్మం, సిరిసిల్ల, వరంగల్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగరకర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.