UBS: ‘గబ్బర్ సింగ్’ వైబ్స్ మళ్లీ వచ్చాయా? పవన్ కొత్త అవతారం చూసి అభిమానులు షాక్!
‘ఓజీ’ తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు సరసన శ్రీలీల మరియు రాశిఖన్న నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కొద్ది రోజుల క్రితమే విడుదల చేశారు.

పవన్–హరీష్ శంకర్ కాంబినేషన్ 13 ఏళ్ల తర్వాత మళ్లీ కలవడం సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచుతున్న ప్రధాన కారణం. వీరిద్దరి గత చిత్రం 2012 బ్లాక్‌బస్టర్ ‘గబ్బర్ సింగ్’, పవన్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది.
కానీ, ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాక రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టడంతో సినిమాలపై ఫోకస్ తగ్గిందనే అభిప్రాయం అభిమానుల్లో కనిపించింది. అయితే, ఈ బీటీఎస్ వీడియో అన్ని అంచనాలను మారుస్తూగబ్బర్ సింగ్ లాంటి ఎనర్జీని మళ్లీ చూపించింది. ఈ బి టి ఎస్ వీడియోలో పవన్ కళ్యాణ్ బ్లాకు సూట్లో, ఇన్‌బిల్ట్ స్వాగ్, ఎనర్జిటిక్ యాటిట్యూడ్‌తో కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో ఉన్న చాలామంది డాన్సర్లలా గొప్ప డాన్సర్ కాకపోయినా తన డ్యాన్స్ స్టైల్ ఆఫ్ స్వాగ్ తో కుర్రకారుని తన తన వైపుకి తిప్పుకుంటాడు. ఫలితంగా, చాలా ఏళ్ల తర్వాత హరీష్ శంకర్ ఆ కల్ట్ స్వాగ్‌ను తెరపైకి తీసుకొస్తున్నాడు.

అదనంగా, పవన్ స్టైలిష్ మూవ్స్, అజెయ స్వాగ్తో పాటు పాట కూడా బాగుంటే దీంతో తెలుగు ప్రేక్షకుల న్యూ ఇయర్ ప్లేలిస్ట్‌లో టాప్ చాయిస్‌గా నిలుస్తుంది.
మొత్తంగా, ఈ సినిమా పవన్ ఫ్యాన్స్‌కు మరో ఫెస్టివల్‌ను అందించనుంది.

