“SVC 2026 లైన్అప్ సూపర్ స్ట్రాంగ్! మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమా?”
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్” (Sri Venkateswara Creations) అంటేనే నాణ్యమైన చిత్రాలకు చిరునామా. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు శిరీష్ సారథ్యంలో నడిచే ఈ సంస్థ, దశాబ్దాలుగా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎప్పటిలాగే కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే, ఇటీవల కొన్ని విజయాలు–కొన్ని పరాజయాలు ఎదుర్కొన్న ఈ బ్యానర్, ఇతర ప్రొడక్షన్ హౌజ్‌ల మాదిరిగా భారీ పాన్-ఇండియా చిత్రాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అందువల్ల, వారి తదుపరిప్రాజెక్ట్స్ ఆసక్తి నెలకొంది.
అయితే, ఇటివల గోవాలో జరిగిన IFFI ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా దిల్ రాజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సహనిర్మాత శిరీష్ తమ బ్యానర్‌కి సంబంధించిన తాజా అప్డేట్స్ను వెల్లడించారు. ముఖ్యంగా, వారి సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా తో హిందీ లో అడుగు పెట్టబోతున్నాం . ఈ సినిమాని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరో గా రీమేక్ చేయబోతున్నాం అని చెప్పారు. అలాగే హిందీలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారు.

అదనంగా, శిరీష్ మాట్లాడుతూ 2026 సంవత్సరం మా బ్యానర్‌కు చాలా కీలకం అవుతుందని అన్నారు. అందుచేత, ఆ ఏడాదిలో కనీసం ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇంకా, ప్రస్తుతం తొమ్మిది ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. కానీ 6 సినిమాలు అయితే తప్పకుండ విడుదల అవుతాయ్ అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ ఆరు సినిమాలో ఒక మూవీ తప్పకుండా పవన్ కళ్యాణ్ తో చేస్తున్నాం అని శిరీష్ అని చెప్పారు. ఇంకా సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
వేణు దర్శకత్వంలో దేవి శ్రీ ప్రసాద్ కథానాయకుడిగా చేస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. కాబట్టి, ఇది DSP నటుడిగా కనిపించే అరుదైన సినిమా కావడంతో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

అయితే, మరో ప్రాజెక్ట్ అయిన ‘రౌడీ జనార్థన’ షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా, రవికిరణ్ కోల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా 2026లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో, ఇది కూడా బ్యానర్‌కు కీలక సినిమా కానుంది.
మొత్తంగా, Sri Venkateswara Creations వచ్చే సంవత్సరాల్లో వరుసగా సినిమాలను విడుదల చేస్తూ మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి రావడానికి సిద్ధమవుతోంది. చివరికి, ఈ ప్రాజెక్టులు ప్రేక్షకుల్లో పెద్ద అంచనాలు సృష్టిస్తున్నాయి

