రవితేజ కొత్త సినిమా మీదున్న‘6 హీరోయిన్’ రూమర్స్ నిజమా? టీమ్ ఇచ్చిన క్లారిటీ ఇదే!

ప్రస్తుతం సోషల్ మీడియాలో రవితేజ కొత్త సినిమా గురించి ఒక వార్త చాలా హడావిడి సృష్టిస్తుంది. అందులో ఆయన తదుపరి సినిమాలో ఆరుగురు హీరోయిన్ నటిస్తున్నారని వార్త నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. వెంటనే వార్తపై ట్విట్టర్ ఖాతాలో instagram లో సరదా మీమ్స్ మరియు ట్రోలింగ్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి.

రవితేజ  PR యూనిట్ అధికారికంగా స్పందిస్తూ, “మాస్ మహారాజా రవితేజ గారి కొత్త సినిమాలో ఆరు హీరోయిన్‌లు నటిస్తున్నారన్నది అసత్య ప్రచారం. దయచేసి ఇలాంటి వదంతులను నమ్మకండి” అంటూ చెప్పుకోచారు. దీంతో ఆన్‌లైన్‌లో జరుగుతున్న రూమర్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి.

ప్రస్తుతం రవితేజ, కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న “భర్త మహాసయులకు విజ్ఞాపతి” (Bhartha Mahasayulaku Wignyapthi) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి 2025 సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే, ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఆ చిత్ర షూటింగ్ రాజమండ్రి ప్రాంతాల్లో కొనసాగుతోంది.

ఇటీవలి కాలంలో రవితేజకు కొన్ని సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా, మరోవైపు ఆయన కొత్త కథలు, కొత్త జానర్లు ప్రయత్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా, ఆయన సైన్ చేస్తున్న ప్రాజెక్టులు ఆసక్తికరంగా ఉండటంతో అభిమానుల్లో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

మొత్తంగా చూస్తే, ఆరు హీరోయిన్‌ల వార్త పూర్తిగా తప్పుడు ప్రచారం. అందువల్ల అభిమానులు అధికారిక అప్‌డేట్స్‌ను మాత్రమే నమ్మడం మంచిది.

చివరగా, రవితేజ రాబోయే సినిమాలు ఆయన కెరీర్‌కి మళ్లీ మాస్ హైప్ తీసుకురావచ్చు అన్న ఆశాభావం కనిపిస్తున్నది.