“రాజ్- సమంతల కొత్త పెళ్లి… పాత భార్య కొత్త ఆగ్రహం?”
ఎన్నో రోజులుగా వినిపిస్తున్న రూమర్లకు చివరికి తెరపడింది. దర్శకుడు రాజ్ నిడిమోరు మరియు నటి సమంత పెళ్లి జరిగిన విషయం అధికారికంగా వెలుగులోకి వచ్చి, నెటిజన్లు మరియు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మరోవైపు, రాజ్ నిడిమోరుమాజీ భార్య శ్యామాలి (Shhyamali) సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. తరచూ తన భావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకునే ఆమె, తాజాగా ‘ఈ అనంత విశ్వంలో మనం ఒక చిన్న మూల మాత్రమే’ అనే భావం ఉన్న ఇమేజ్‌ను షేర్ చేశారు.

డిసెంబర్ 1 ఉదయం అంటే రాజ్ సమంత వివాహం జరిగిన రోజే శ్యామాలి చేసిన మరో పోస్ట్ కూడా పెద్ద చర్చకు దారి తీసింది. అందులో,“తెగించిన వ్యక్తులు తమ స్వభావానికే తగ్గట్టుగా ప్రవర్తిస్తారు”అని ఆమె భావవ్యక్తీకరణ చేశారు.
అదేవిధంగా, ఐదు రోజుల క్రితం ఆమె పెట్టిన మరో మెస్సేజ్ కూడా మళ్లీ వైరల్ అవుతోంది. అందులో,“మనతో రుణం ఉన్నంతవరకు బంధాలు కొనసాగుతాయి… రుణం పూర్తయిన తర్వాత ఆ బంధం దూరమవుతుంది”అని పేర్కొన్నారు.

