ఆ హీరో తో ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన మీనాక్షి! రిలేషన్ బయటపడిందా?

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది నటీనటులు తమ సింగిల్ జీవితానికి స్వస్తి చెప్పి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కొందరి గురించి ఇంకా రూమర్స్ కొనసాగుతుండగా మరికొందరు మాత్రం తమ వ్యక్తిగత విషయాలను బయట పెట్టకుండా నిశ్శబ్దంగానే ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హర్యానాలో జన్మించిన మీనాక్షి మొదట మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించారు. ఆమె తండ్రి భారత సైన్యంలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. ఆర్మీ కుటుంబం కావడంతో చదువులోనూ ఆమె ఎప్పుడూ మంచి ర్యాంకులు సాధించేవారు. పంజాబ్‌లోని నేషనల్ డెంటల్ కాలేజీ & హాస్పిటల్‌లో డెంటల్ సర్జన్‌గా ఈ మధ్యే గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. మీనాక్షి ఒక మంచి క్రీడాకారిణి కూడా. స్టేట్ స్థాయి స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని అనేక అవార్డులు గెలుచుకున్నారు. తరువాత అందాల పోటీల్లో అడుగుపెట్టి ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌తో పాటు మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ లోనూ విజేతగా నిలిచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మీనాక్షి చౌదరి వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో:

2019లో హిందీ చిత్రం ‘అప్‌స్టార్ట్స్’తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ హర్యానా బ్యూటీ, 2021లో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అనంతరం ‘ఖిలాడీ’, ‘హిట్ 2’, మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వరుణ్ తేజ్ ‘మట్కా’ వంటి పలు పెద్ద చిత్రాల్లో కనిపించింది. అయితే నిజమైన గుర్తింపు, అభిమానుల ప్రేమ మాత్రం దుల్కర్ సల్మాన్‌తో నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమాతో వచ్చింది. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో మీనాక్షి కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ ఏర్పడింది. ఆ తర్వాత 2025 సంక్రాంతికి విడుదలైన ‘వస్తున్నాం’ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో వరుసగా రెండు భారీ విజయాలు అందుకుని టాప్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమె బిజీ అందరూ తెలిసిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (ది గోట్), ‘సింగపూర్ సలూన్’, ‘కోలై’ వంటి చిత్రాల్లో కీరవాణి పాత్రలు పోషించి రెండు భాషల్లోనూ గుర్తింపు పొందింది.

మీనాక్షి చేతిలో రెండు పెద్ద ప్రాజెక్టులు:

నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో మీనాక్షి ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్రలో కనిపించనున్నారు.  అక్కినేని నాగచైతన్యతో కలిసి “వృషకర్మ” సినిమాలో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి ఒక పరిశోధనాధికారిణి, అంటే ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు. చైతు కెరీర్‌లోనే అత్యంత భిన్నమైన పాత్రల్లో ఒకటిగా ఈ ప్రాజెక్ట్ భారీ అంచనాలు సృష్టిస్తోంది.

మీనాక్షి ప్రేమలో ఉన్న హీరో ఎవరంటే?

ఇది ఇలా ఉండగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గాసిప్స్ కూడా సోషల్ మీడియాలో  ప్రస్తుతం వైరల్ అవుతన్నాయ్ . ఒక ప్రముఖ హీరోతో మీనాక్షి ప్రేమలో ఉన్నారన్న వార్తలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వీటిపై అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు.  అయితే ఆమె డేటింగ్ చేస్తున్న వ్యక్తి మరెవరో కాదు… టాలీవుడ్ నటుడు సుశాంత్ అని పలువురు చెబుతున్నారు. అక్కినేని నాగార్జున మేనల్లుడైన సుశాంత్‌తో మీనాక్షి సాన్నిహిత్యం పెరిగిందన్న రూమర్స్ చాలా రోజులుగా వినిపిస్తున్నాయి.

ఈ ఇద్దరూ మొదటిసారిగా 2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాలో జంటగా నటించారు. ఆ చిత్రం షూటింగ్‌లోనే వీరి మధ్య సన్నిహితం పెరిగిందని, అది క్రమంగా ప్రేమగా మారిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. దాదాపు నాలుగేళ్లుగా ఈ రిలేషన్‌షిప్ రహస్యంగా కొనసాగుతోందని అంటున్నారు.

ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సుశాంత్, మీనాక్షి ఇద్దరూ కలిసి స్పాట్ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఒకేసారి ట్రావెల్ చేస్తూ, ఒకరికొకరు చాలా కంఫర్టబుల్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ నుంచి ఇండస్ట్రీ వర్గాల వరకు అందరూ “ఇద్దరూ డేటింగ్‌లోనే ఉన్నారు” అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇద్దరూ ఇంకా అధికారికంగా ఏమీ చెప్పకపోవడంతో ఈ లవ్ స్టోరీ ఇంకా రహస్యంగానే కొనసాగుతోంది.