బాహుబలి ఎపిక్ జపాన్ రిలీజ్ – ప్రభాస్ కొత్త లుక్ స్పిరిట్ కోసమేనా?
రాజమౌళి దర్శకత్వంలో మరియు ప్రభాస్ హీరో గా రూపొందిన భారీ పౌరాణిక యాక్షన్ డ్రామా చిత్రం బాహుబలి. ఈ సినిమా భారతీయ సినిమాకి కొత్త స్థాయిని తీసుకెళ్లిన విజువల్ స్పెక్టాకిల్‌గా గుర్తింపు పొందింది. రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.అద్భుతమైన సెట్లు, గ్రాఫిక్స్, ఎమోషన్, యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుని భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాయి. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించి భారత సినీ చరిత్రలో నిలిచిపోయే మహా చిత్రంగా నిలిచింది.
ఇటీవల బాహుబలి: ది ఎపిక్ (Baahubali: The Epic) అనే పేరుతో బాహుబలి–franchise ను ఒక్కటిగా మార్చి మరోసారి విడుదల చేశారు .ఈ “Epic” వెర్షన్ 2025 అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.అందువల్ల ప్రేక్షకులు ఒక్కసారి మొత్తం కథను చూడవచ్చు. ఈ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 39.75 కోట్లు సంపాదించింది.

మరోవైపు, “బాహుబలి: ది ఎపిక్” జపాన్‌లో డిసెంబర్ 12, 2025న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ప్రభాస్ ఇప్పటికే టోక్యోలో స్పెషల్ స్క్రీనింగ్‌లకు (డిసెంబర్ 5, 6) వచ్చి, ఫ్యాన్స్‌తో మాట్లాడాడు.
ప్రభాస్ ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ “బాహుబలి తర్వాత రాజమౌళి గారు, షోభు గారు, లక్ష్మి గారు అందరూ మీ గురించి చాలా అందంగా మాట్లాడారు. మీరు చాలా ఎమోషనల్ ఫ్యాన్స్. 10 సంవత్సరాలుగా జపాన్ గురించి వింటున్నాను.” “కల్కి 2898 ఏడీ ప్రమోషన్‌కు రావాలనుకున్నా, చిన్న గాయంతో రాలేకపోయాను. కానీ ఇప్పుడు మీరందరినీ చూశాను. జపాన్ రావడం నా కల. ప్రతి సంవత్సరం వచ్చి మీతో కలవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ది లవ్!” అంటూ జపాన్ ఫాన్స్ తో చెప్పుకొచ్చాడు.
అంతేకాక, ఈసారి ప్రభాస్ కొత్తగా కనిపించిన lean look చాలా మంది దృష్టిని ఆకట్టుకుంది. గతంలో సోషల్ మీడియాలో ఆయన లుక్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే, జపాన్ ఈవెంట్‌లో ఆయన ఎలాంటి head cloth లేకుండా కనిపించాడు. దాంతో అభిమానులకు భారీ సర్ప్రైజ్ లభించింది.

ప్రభాస్ అప్‌కమింగ్ మూవీస్:
ది రాజాసాబ్ సినిమా హారర్, కామెడీ, రొమాన్స్‌ను అందంగా కలిపిన స్టైలిష్ ఎంటర్టైనర్ గా అభివృద్ధి అవుతోంది. మారుతి దర్శకత్వం వహిస్తుండగా, మాలవిక మోహన్ మరియు నిధి అగర్వాల్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. షూటింగ్ దాదాపు పూర్తయ్యింది మరియు సినిమా జనవరి 9, 2026న, సంక్రాంతి సీజన్‌లో విడుదల కానుంది. ప్రభాస్ ఈ చిత్రంలో పూర్తిగా తాజా లుక్‌తో కనిపించబోతుండటం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది.
ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ లుక్ లో ఉన్నట్లు సమాచారం

