ప్రియాంక vs దీపికా – ‘కల్కి 2’లో ఎవరు? కల్కి 2’పై షాకింగ్ అప్‌డేట్స్!

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ మరియు దీపిక పడుకొనే హీరోయిన్ గా భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిన చిత్రం కల్కి 2898 AD. ఈ సినిమాని వైజయంతి మూవీస్ నిర్మాత అశ్విని దత్ గారు నిర్మించారు. ఈ సినిమాలో అమితాబచ్చన్ మరియు కమల్ హాసన్ వంటి అగ్ర తారలు నటించారు . కానీ ఈ సినిమా కి పార్ట్ 2 ఉంది అని చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసినప్పటికీ సినిమా ప్రారంభానికి ప్రారంభానికి కొంత సమయం పట్టవచ్చని టాలీవుడ్ వర్గాల చెబుతున్నాయి.

దీనికి కారణం, ఈ చిత్రం పూర్తిగా VFX పనిపై ఆధారపడడం వల్ల  చిత్ర యూనిట్ మరియు దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మీద దృష్టి పెట్టారు. అలాగే ప్రభాస్ కూడా ఇతర ప్రాజెక్టులలో బిజీ ఉండడం వల్ల ఈ సినిమా కొంచెం లేటుగా ప్రారంభం అవుతుంది అని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉండగా, కల్కి పార్ట్ -1 లో నటించిన దీపికా పడుకొనే,  కల్కి  పార్ట్-2 లో ఉండదని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎప్పుడో స్పష్టం చేసింది. ఇప్పుడు తాజాగా చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ప్రస్తుతం తాజా వార్తలు ప్రకారం ప్రభాస్ సరసన నటించేది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా పేరు ఈ చర్చలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె ఈ పాత్రకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని, చిత్ర బృందం కూడా ఆమెపై ఆసక్తి చూపుతోందని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది. బాలీవుడ్ మీడియా కూడా ఇదే విషయాన్ని సమర్థిస్తోంది.

మొత్తంమీద, ‘కల్కి 2’ చిత్రం గ్రాఫిక్స్ పనులు, నటీనటుల ఎంపిక విషయంలో ప్రేక్షకుల అంచనాలను పెంచుతూ, దాని ప్రారంభానికి ముందే గణనీయమైన చర్చకు దారితీసింది.