టీమ్ ఇండియా స్టార్‌తో మృణాల్ రిలేషన్?రూమర్‌పై మృణాల్ ఫైర్!
సినిమా ఇండస్ట్రీ లో స్టార్‌ల గురించి అఫైర్ రూమర్స్, డేటింగ్ గాసిప్స్ చాలా కాలంగా కొనసాగుతున్నవే. అయితే, ప్రముఖ హీరో–హీరోయిన్ల పేర్లు బయటకు వస్తే ఫ్యాన్స్‌లో ఆసక్తి ఒక్కసారిగా పెరుగుతుంది. కొన్ని రోజుల ముందు , టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా చర్చకు వచ్చిన రూమర్ – ధనుష్ మరియు మృణాల్ ఠాకూర్ మధ్య ఉన్నట్లు చెప్పబడుతున్న రిలేషన్. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా మారారనే కథనాలు గుసగుసలుగా వినిపించాయి. కానీ అప్పటికప్పుడే, మృణాల్ ఆ వార్తలను ఖండిస్తూ, ధనుష్ తనకు మంచి స్నేహితుడే అని తెలిపింది. కాబట్టి, తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనన్న సందేశాన్ని ఆమె మరోసారి స్పష్టం చేశారు.
మళ్లి కొత్తగా వస్తున్న రూమర్స్ మృణాల్ ఠాకూర్ మరియు ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో తాను డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయ్ . కానీ అప్పటికప్పుడే అలాంటి రూమర్స్‌కి నటి మృణాల్ ఠాకూర్ స్పందించింది. మొదటగా, ఈ వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం అవుతుండగా, ఆమె నేరుగానే రియాక్ట్ అయింది.
మృణాల్ చెప్పినట్లుగా, “ఇలాంటి రూమర్స్ చాలా హాస్యాస్పదం. వాళ్లు ఇలా వార్తలు సృష్టిస్తుంటారు… నేను చూసి నవ్వుకుంటాను. ఇవన్నీ ఫ్రీ పీఆర్ స్టంట్స్ మాత్రమే” అని స్పష్టం చేసింది. దాంతో, ఈ రూమర్‌కి ఆమె క్లియర్‌గా చెక్ పెట్టింది.
మొత్తంమీద, మృణాల్ ఠాకూర్ తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని మరోసారి చెప్పి, సోషల్ మీడియా రూమర్స్ నమ్మాల్సిన అవసరం లేదని సూచించింది.

